చిత్రం : పెళ్లి పందిరి
గానం : బాలసుబ్రమణ్యం
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
అనగనగ ఒక నిండు చందమామ
నీరు పేద కలువతో చెలిమి చేసెనమ్మా
అంతలోనే తెలవారిపోయెనమ్మ
ఆ కన్నె కలువ కల కరిగి పోయెనమ్మ
పచ్చని జంటను విడదీసిన ఆ పాపం ఎవ్వరిదీ
పచ్చని జంటను విడదీసిన ఆ పాపం ఎవ్వరిదీ
కథ మొదలవగానే కాలం కత్తులు దూసింది
కథ మొదలవగానే కాలం కత్తులు దూసింది
ఓ ఓ ఓ .......
అనగనగ ఒక నిండు చందమామ
నీరు పేద కలువతో చెలిమి చేసెనమ్మా
ఆశలెన్నో విరిసేలా బాసలెన్నో చేసాడు
ఉన్నపాటుగా కన్ను మరుగయే చలువ చంద్రుడు
ఆశలెన్నో విరిసేలా బాసలెన్నో చేసాడు
ఉన్నపాటుగ కన్ను మరుగయే చలువ చంద్రుడు
రేరాజును రాహువు మింగాడో
అమావాస్యకి ఆహుతి అయ్యాడో
రేరాజును రాహువు మింగాడో
అమావాస్యకి ఆహుతి అయ్యాడో
అటు ఇటు వెతుకుతూ నిలువునా రగులుతు
వెన్నెల ఉందని వేకువ వద్దని కలువ జన్మ వడలి పోయెనమ్మ
ఆ ఆ ఆ .........
అనగనగ ఒక నిండు చందమామ
నీరు పేద కలువతో చెలిమి చేసెనమ్మా
గుప్పెడంత గుండెల్లో ఉప్పెనైనా సంద్రంలో
చిక్కుకున్న ఈ చిన్న ఆశకి శ్వాస ఆడదే
దిక్కులన్నీ చూస్తున్న నింగిని నిలదీస్తున్న
దిక్కులేని ఈ దిగులు ప్రశ్నకి బదులు దొరకదే
చిరునవ్వులు పూసిన మంట ఇదీ
కన్నీటిని కోరని కోత ఇది
చిరునవ్వులు పూసిన మంట ఇదీ
కన్నీటిని కోరని కోత ఇది
ఓటమై ముగిసిన గెలుపుగా మిగిలిన
జాబిలి వెన్నెల మాటున రేగిన జ్వాలలాంటి వింత బతుకు నాది
ఆ ఆ ఆ ....
ఓ ఓ ఓ ...
కలువని చంద్రుని ఎందుకు కలిపాడు
ఆ కలయిక కలగా ఎందుకు మార్చాడు
ఆ కథ రాసిన దేవుడన్నవాడు
కరునన్నది ఎరుగని కటిక గుండెవాడు
నా కథలో ఆ దేవుడే ఎంతటి దయ చూపించాడు
అడగక ముందే ఇంతటి పెన్నిధి నాకందించాడు
కలలే తరగని ఈ చంద్రుని నేస్తం చేసాడు
ఎపుడు వాడని ఈ కలువని చెలిగా ఇచ్చాడు
ఓ ఓ ఓ ఓ .........
Super lyrics and it is a fantastic explanation with meaning
ReplyDeleteI love this song
ReplyDelete